Showing posts with label Gossips. Show all posts
Showing posts with label Gossips. Show all posts

Thursday, June 2

శంకర్ భారీ బడ్జెట్ చిత్రం లో ఆసిన్ ?

అగ్ర దర్శకుడు శంకర్ విక్రం హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించి స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట శంకర్. అయితే ఈ సినిమా లో ఆసిన్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నాడట. దీని గురించి ఆసిన్ ని కలిసి చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఆసిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రెడీ తెలుగు చిత్రం రీమేక్ లో, షారూఖ్ ఖాన్ తో మరో సినిమా లో కూడా నటిస్తోంది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫర్ కూడా వచ్చింది. మరి ఆసిన్ రానున్న రోజుల్లో ఎటువంటి మెరుపు మెరిపిస్తుందో చూడాలి.

Wednesday, June 1

జూనియర్ ఎన్ టి ఆర్ బరువు సెంటిమెంట్

జూనియర్ ఎన్ టి ఆర్
జూనియర్ ఎన్ టి ఆర్ మొదట్లో బొద్దుగా ఉండేవాడు. తర్వాత యమదొంగ సినిమా అప్పటి నుంచి సన్నబడ్డాడు. సన్నబడ్డ జూనియర్ ఎన్ టి ఆర్ అందరిని ఆకట్టుకున్నాడు. సన్నబడిన తర్వాత తీసిన సినిమాలు కూడా చాలావరకు హిట్ అయ్యాయి. అయితే తాజా గా జూనియర్ ఎన్ టి ఆర్ మళ్ళీ కొద్దిగా బొద్దుగా తయారైనట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన శక్తి సినిమా లో జూనియర్ ఎన్ టి ఆర్ బొద్దుగా కనిపించాడు. అలాగే శక్తి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్ టి ఆర్ బొద్దుగా ఉంటే కలిసి రావట్లేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఒక సెంటిమెంట్ గా వంస్తోదన్నమాట....

Tuesday, May 31

లిప్ లాక్ లతో అదరగొట్టిన చార్మీ - జగపతి

జగపతి బాబు గమ్యం 2 చిత్రం లో విమలా రామన్ తో శృతి మించిన శృంగార సీన్ లలో నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఆ సీన్ లపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా జగపతి బాబు చార్మి కాంబినేషన్ లో వస్తున్న "నగరం నిద్ర పోతున్నవేళ" చిత్రం లో కూడా హాట్ సీన్ లకు కొదువ ఏమీ లేదని తెలుస్తోంది.ఈ సినిమా లో చార్మి తో జగపతి లిప్ లాక్ సీన్ లు చాలా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ ముద్దు సీన్ ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి.

Monday, May 30

ఆ దర్శకుడి తో త్రిష కోరిక తీరలేదు

త్రిష
సౌత్ ఇండియా లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. కానీ త్రిష కి ఒక తీరని కోరిక ఉందట. అదే మణిరత్నం దర్శకత్వం లో నటించాలని. అయితే మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన యువ సినిమా లో త్రిష నటించింది. కానీ అందులో ఉన్న ముగ్గురు హీరోయిన్ లలో ఒకరిగా నటించింది. సోలో గా మణిరత్నం దర్శకత్వం లో నటించాలన్నది త్రిష కోరికట. మరి ఈ కోరికని మణిరత్నం ఎప్పుడు తీరుస్తాడో...?

Saturday, May 28

శేఖర్ కమ్ముల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలు

శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అనే టైటిల్ తో ఒక కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో హీరో హీరోయిన్ లు అంతా కొత్తవాళ్ళేనట. వీళ్ళ సెలెక్షన్ కోసం టాలెంట్ హంట్ నిర్వహించాడు శేఖర్ కమ్ముల. కానీ ఎవ్వరు సెలెక్ట్ అవ్వలేదట. ఇదిలా ఉంటే కొంత మంది బాగా డబ్బున్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలు శేఖర్ కమ్ముల ఇంటి చుట్టూ తిరుగుతున్నారట. కొంత మంది సినీ ఇండస్ట్రీ కి చెందిన పెద్దల రికమండేషన్ లతో శేఖర్ కమ్ముల ని సంప్రదిస్తున్నారట. మొత్తానికి మన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంటి చుట్టూ అందమైన అమ్మాయిలేనట. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ క్యారక్టర్ నీట్ గా ఉండడమే ఇంత పోటీ కి కారణమని తెలుస్తోంది.



Thursday, May 26

ఇలియానా అలసట తీరిపోయింది

ఇలియానా
ఇలియానా ఇటీవలే చాలా అలసట కి గురయ్యి హాస్పిటల్ లో చేరింది. ట్రీట్‌మెంట్ అనంతరం ఓకె అయ్యిందట ఇలియానా. తను ప్రస్తుతం పూర్తిగా కోలుకుందట. నీరసం పూర్తిగా ఎగిరిపోయిందట. తను ప్రస్తుతం "3 ఈడియట్స్" తమిళ రీమేక్ చిత్రం షూటింగ్ లో భాగంగా కోయంబత్తూర్ వెళ్లిందట ఇలియానా.

నేనా... సునీల్ ప్రక్కనా... - త్రిష

త్రిష
సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ లలో ఒకరుగా కొనసాగుతోంది త్రిష. త్రిష కి చిన్న హీరోలంటేనే ఒప్పుకోదు. అలాంటిది కామెడీ హీరోలంటే అస్సలు ఒప్పుకోదు అని ప్రతీ ఒక్కరు ఊహించవచ్చు. సునీల్ హీరోగా నెపోలియన్ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో త్రిష ని హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారట దర్శక, నిర్మాతలు. ఈ విషయమై త్రిష ని సంప్రదించగా "నేనా .. కామెడీ హీరో సునీల్ ప్రక్కనా ... " అని నవ్విందట. వెంకటేష్, పవణ్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటిస్తున్న  నేను సునీల్ తో ఎలా ఒప్పుకుంటాను అని చెప్పిందట త్రిష.

స్వంత వాయిస్ తో కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్
ఈ మధ్యన హీరోయిన్ లు తమ క్యారక్టర్ కి తమే వాయిస్ చెప్పుకుంటూ సంథింగ్  స్పెషల్ అని చాటుకుంటున్నారు. ఇటీవల విడుదలయిన హిట్ చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్ లో తాప్సీ ఇలాగే డబ్బింగ్ చెప్పుకొని తన సత్తా చాటింది. కానీ అదే సినిమా లో నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. దాదాపు అందరి అగ్ర హీరోలతోను నటించిన కాజల్ టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. అయితే తన తాజా చిత్రం లో తనే స్వంతం గా డబ్బింగ్ చెప్పుకోనుందట. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటింస్తోంది. ఈ సినిమా లో తనే స్వంతం గా డబ్బింగ్ చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Monday, May 23

జూనియర్ ఎన్ టి ఆర్ పక్కనే నేనుండాలి - మహేష్ బాబు

మహేష్ బాబు - జూనియర్ ఎన్ టి ఆర్
ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వస్తున్నాడట. ఇదే సమయం లో ఒక సన్నివేశం జరిగిందట. ఎయిర్‌పోర్ట్ బయట ఉన్న క కట్ ఔట్ మహేష్ బాబు ని బాగా ఆకర్షించిందట. అది మలబార్ గోల్డ్ కంపెనీది. దానిని ప్రమోట్ చేస్తున్నది జూనియర్ ఎన్ టి ఆర్. అది చూడగానే తను ప్రమోట్ చేస్తున్న జాయ్ అలుకాస్ కంపెనీ గుర్తుకు వచ్చిందట. తన కట్ ఔట్ కూడా అక్కడ ఉంటే బాగుంటుందని కంపెనీ ప్రతినిధులకు వివరించాడట. త్వరలో నే ఏర్పాటు చేస్తామని చెప్పారట కంపెనీ ప్రతినిధులు.

Gossip: Ram Charan as 'Sivudu' Under Ram Gopal Varma Direction!!



Ram Gopal Varma who is always in the news with many reasons is again in news.
Ram Charan as 'Sivudu' Under Ram Gopal Varma Direction!!If the buzz is to believed Varma is planning a new film to direct the Mega Power Star Ram Charan in the lead. Buzz is that Varma has already had a few discussions with Ram Charan regarding the script. There is also a buzz that the film has been titled as Shivudu. If everything goes well, Ram Charan and RGV teams up and the project starts rolling its camera from September.
The script work is said to be under progress. Ram Gopal Varma has started a movie with Chiranjeevi before and stopped it and again he was in news that he is planning to make a movie called Dora-the lord but it did not materialize and now he is into news with Ram Charan movie Shivudu.We have to wait and see whether varma's dream of making a movie with Mega family will come true or not.
On the other hand Ram Charan is busy with Racha. It would be an out and out commercial and action oriented directed by Sampath Nandi. Ram Charan is going to appear in a new look with his 8 Pack abs for this flick. 

Sunday, May 22

రేఖ పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరు ?

రేఖ
బాలీవుడ్ నటి రేఖ జీవితాన్ని సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి "సితారే" అనే టైటిల్ ని ఖరారు చేశారు. కపిల్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమా లో హీరోయిన్ ఎవరిని పెడదామన్న దాని పై ప్రయత్నాలు చేస్తున్నారట సినిమా టీం. శ్రీదేవి, రాణి ముఖర్జి, బిపాసా బసు లలో ఎవరినో ఒకరిని "సితారే" చిత్రం లో హీరోయిన్ గా సెలెక్ట్ చేయనున్నారని సమాచారం.

హిందీ లో "ప్రేమిస్తే" సినిమా

ప్రేమిస్తే
భరత్, సంధ్య జంటగా నటించిన చిత్రం "ప్రేమిస్తే". ఇది తమిళం లో "కాదల్" పేరట తీశారు. దానికి తెలుగు డబ్బింగ్ సినిమానే ప్రేమిస్తే. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయడానికి బాలాజీ టెలీ ఫిలింస్ అధినేత ఏక్తా కపూర్ సన్నాహాలు చేస్తుందట.విక్రమాదిత్య మోత్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. హిందీ వర్షన్ లో ప్రతీక్ బబ్బర్ హీరోగా నటించనున్నాడట. హీరోయిన్ ఎవరో ఇంకా ఖరారు కాలేదట.

Thursday, May 19

రాం గోపాల్ వర్మ కథ కాపీ కొట్టాడట...?

విజయవాడ రౌడీయిజాన్ని కథ గా తీసుకొని రాం గోపాల్ వర్మ "బెజవాడ రౌడీలు" సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే కథ ని ప్రధానం చేసుకొని దర్శకుడు దేవా కట్టా "ఆటోనగర్ సూర్య" సినిమా ని తీయబోతున్నాడు. అయితే వర్మ తీస్తున్న సినిమా కథ దేవా కట్ట దే నట. ఒక సంవత్సరం క్రితం వర్మ కలిసినప్పుడు దేవా కట్ట ఈ స్టోరీని రాంగోపాల్ వర్మ కి చెప్పాడట. కానీ అదే కథ తో వర్మ సినిమా తీయడం దేవా కట్ట ని చాలా బాధిస్తోందట. బయటకి డైరెక్ట్ గా చెప్పకపోయినా లోపల వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఇంతకీ మన వివాదాల వర్మ పై వచ్చే వార్తల్లో ఏది మార్కెటింగ్ కోసమో ఏది నిజమో గుర్తించడం కష్టమే.


అసలు ఇలియానా ఎవరో తెలియదు ?

ఇలియానా
ఇటీవల ఇలియానా ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ఇండియా" అనే చిత్రం లో అక్షయ్ కుమార్ సరసన ఇలియానా నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో ఇలియానా "మందాకిని" పాత్రని పోషిస్తోంది అని పేర్కొనడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి ఈ సినిమా దర్శకుడు మిలినా బధ్రియా దగ్గర ప్రశ్నించినపుడు ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అసలు ఇలియానా అంటే ఎవరో కూడా తెలియదని పేర్కొన్నాడట. దర్శకుడి మాటలను బట్టి ఇలియానా ఈ సినిమా లో ఉండదనే విషయం స్పష్టం అవుతుంది.


బ్రెట్ లీ చేష్టలతో సిగ్గుపడిన దీపిక పదుకొనె ?

దీపిక పదుకొనె
ఇటీవల షారూఖ్ ఖాన్ క్రికెట్ ప్లేయర్ల కోసం ఒక పెద్ద పార్టీ ని ఏర్పాటు చేశాడట. ఈ పార్టీ కి దీపిక పదుకొనె కూడా హాజరయ్యిందట. అయితే ఇదే పార్టీ లో ఉన్న ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బ్రెట్ లీ కారణం గా దీపికా పదుకొనె తీవ్ర ఇబ్బందికి లోనైందట. పార్టీ జరుగుతున్నంత సేపు బ్రెట్ లీ దీపికా వైపే చూడటం, దీపిక ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడం. తన చుట్టు తిరుగుతూ పాటలు పాడటం చేశాడట. దీంతో దీపిక సిగ్గుతో అలా ఉండిపోయిందట.

Wednesday, May 18

బాలకృష్ణ , కళ్యాణ్ రాం ల కొత్త చిత్రం ?

బాలకృష్ణ - కళ్యాణ్‌రాం
నందమూరి కళ్యాణ్ రాం ఎన్‌టీఅర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తనే హీరోగా నటిస్తూ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అబ్బాయ్ బ్యానర్ లో సినిమా చేస్తానని బాబాయ్ బాలకృష్ణ చెప్పాడట. ఈ వార్త తో ఎంతో సంతోషానికి లోనైన కళ్యాణ్ రాం బాలకృష్ణ కోసం ఒక మంచి కథ ని సిద్దం చేసుకునే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఒక అగ్ర దర్శకుడితో బాలకృష్ణ సినిమా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడట కళ్యాణ్‌రాం. ఈ అబ్బాయ్ బాబాయ్ ల సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Tuesday, May 17

8 ప్యాక్ లో చరణ్, బికినీ లో తమన్నా - రచ్చ రచ్చే

రాంచరణ్ - తమన్నా
రాంచరణ్ తాజా చిత్రం "రచ్చ". చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 వ తేదీన ప్రారంభం కానుంది. రాంచరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ చిత్రం లో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయట. రచ్చ సినిమా కోసం రాంచరణ్ 8 ప్యాక్ బాడీ ని సిద్దం చేసుకున్నాడట. ఈ సినిమా లో 8 ప్యాక్ బాడీ తో అభిమానులను అలరించనున్నాడు మెగా పవర్ స్టార్. ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉందట. తమన్నా ఈ సినిమా లో 2 పీస్ బికినీ లో కనిపించబోతుందట. కుర్రకారు ఈ సీన్ లో తమన్నా ని చూసి మతి పోగొట్టుకునే విధం గా తీయబోతున్నారట. ఇలాంటి మరిన్ని జిమ్మిక్కులతో సినిమా తీయడానికి దర్శకుడు సంపత్ నంది సిద్దంగా ఉన్నాడని సమాచారం.

Saturday, May 14

రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా

రాంచరణ్ అల్లు అర్జున్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ వీళ్ళిద్దరి కోసం సరిబోయే  ఒక కథ ని కూడా తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని, పి ఆర్ పి శాసన సభ్యులు గంటా శ్రీనివాస రావు నిర్మిస్తాడని తెలుస్తోంది. ఇద్దరూ అగ్ర హీరోలు కావడం తో స్టొరీ ని ఏ మాత్రం పొరపాట్లు లేకుండా తయారు చేయాలని అందరూ ఆలోచిస్తున్నారట. ఈ మెగా ఫ్యామిలీ సినిమా ఎటువంటి సంచనాలు సృష్టిస్తోందో చూడాలి....

నేను సెకండ్ సెటప్ ని కాను - తాప్సీ


తాప్సీ
"ఘుమ్మంది నాదం" ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఆ తర్వాత "వస్తాడు నా రాజు" లో నటించింది. ఈ రెండు సినిమాలు మినహా తాప్సీ చేసిన ప్రతీ సినిమాలోను ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ అగర్వాల్, తాప్సీ జంటగా నటించారు. ఇప్పుడు రాబోతున్న రవితేజ "వీర" లో కూడా కాజల్, తాప్సీ జంటగా నటిస్తున్నారు. అయితే ఇటువంటి క్యారక్టర్ లు ఎంచుకోవడం వలన తాప్సీ ని అందరూ సెకండ్ హీరోయిన్ అంటున్నారట. ఇదే విషయాన్ని తాప్సీ దగ్గర ప్రస్తావించినప్పుడు - "నేనేం సెకండ్ హీరోయిన్ ని కాదు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ పాత్రకి నా పాత్రకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే చిత్రాల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్లనే ఎంచుకుంటాను" అని చెప్పిందట తాప్సీ. 

Wednesday, May 11

పవర్ స్టార్ ని మాయ చేసిన నిర్మాత ?

పవణ్ కళ్యాణ్
అవును.... టాలీవుడ్ పవర్‌స్టార్ పవణ్ కళ్యాణ్ నే ఒక నిర్మాత మాయ చేసినట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ నిర్మాత మరెవరో కాదు.. గణేష్ బాబు. ఇటీవలే గణేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరోగా "తీన్‌మార్" సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే పవణ్ కళ్యాణ్ రాబోయే చిత్రం "గబ్బర్ సింగ్" ని కూడా గణేష్ బాబు నిర్మిస్తున్నాడు. మొదట పవణ్ కళ్యాణ్ తన స్వంత బ్యానర్ లో ఈ సినిమా తీయాలని భావించాడు. కానీ మళ్ళీ ఈ అవకాశాన్ని గణేష్ బాబు కి ఇచ్చాడు. ఎందరో అగ్ర నిర్మాతలు పవణ్ తో సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నప్పటికి వరుసగా రెండో సారి అదే నిర్మాతకి కేటాయించడం ఆశ్చర్యం. దీన్ని చూస్తుంటే గణేష్ బాబు పవణ్ కళ్యాణ్ కి ఏదో మాయ చేసినట్టుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
Related Posts Plugin for WordPress, Blogger...