skip to main |
skip to sidebar
పవర్ స్టార్ ని మాయ చేసిన నిర్మాత ?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhvqCKm6Io1hWdoYzxga-rpjk0rpBiGaWYqZ4Hyp-rdF0uvrd-hKFR_DFk8jubGa6LT5COtvjHiad3oOTVftUVJZvkSqajqOYEcN8R9JnrEWRZXQJzlL2TPuIbz1wftKgM4kDakrNaeRIk/s1600/Pawan+Kalyan.JPG) |
పవణ్ కళ్యాణ్ |
అవును.... టాలీవుడ్ పవర్‌స్టార్ పవణ్ కళ్యాణ్ నే ఒక నిర్మాత మాయ చేసినట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ నిర్మాత మరెవరో కాదు.. గణేష్ బాబు. ఇటీవలే గణేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరోగా "తీన్‌మార్" సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే పవణ్ కళ్యాణ్ రాబోయే చిత్రం "గబ్బర్ సింగ్" ని కూడా గణేష్ బాబు నిర్మిస్తున్నాడు. మొదట పవణ్ కళ్యాణ్ తన స్వంత బ్యానర్ లో ఈ సినిమా తీయాలని భావించాడు. కానీ మళ్ళీ ఈ అవకాశాన్ని గణేష్ బాబు కి ఇచ్చాడు. ఎందరో అగ్ర నిర్మాతలు పవణ్ తో సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నప్పటికి వరుసగా రెండో సారి అదే నిర్మాతకి కేటాయించడం ఆశ్చర్యం. దీన్ని చూస్తుంటే గణేష్ బాబు పవణ్ కళ్యాణ్ కి ఏదో మాయ చేసినట్టుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.