Showing posts with label Ramcharan Tej. Show all posts
Showing posts with label Ramcharan Tej. Show all posts

Friday, May 27

వరుస చిత్రాలతో పండగ చేయనున్న రాంచరణ్ తేజ్

రాంచరణ్ తేజ్
ప్రస్తుతం రాంచరణ్ తేజ్ వరుసగా మూడు సినిమాలకు అంగీకరించాడు. ముగ్గురు అగ్ర హీరోయిన్ లతో రూపొందుతున్న ఈ చిత్రాలతో అభిమానులకు పండగ చేయనున్నాడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న "రచ్చ" సినిమా లో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా జత కడుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి సమంత హీరోయిన్ గా ఎంపికయ్యింది. తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ ఖరారు చేసుకున్న చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందని ప్రాధమిక సమాచారం. తెలుగు సినిమా చరిత్రని తిరగ రాసిన మగధీర తర్వాత మరోసారి రాంచరణ్ తేజ్ సరసన నటించనుంది కాజల్ అగర్వాల్. మొత్తానికి రానున్న రోజుల్లో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.


Friday, May 20

బావ ని నిర్మాతని చేస్తున్న రాంచరణ్


రాంచరణ్ తేజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని పి ఆర్ పి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, దిల్ రాజులు నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ లో దిల్ రాజు లేడని తేలిపోయింది. గంటా శ్రీనివాసరావు తో పాటు రాంచరణ్ సోదరి, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితవదన భర్త విష్ణు ప్రసాద్ నిర్మిచనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణ్ తేజ్ ప్రకటించాడు.

Tuesday, May 17

8 ప్యాక్ లో చరణ్, బికినీ లో తమన్నా - రచ్చ రచ్చే

రాంచరణ్ - తమన్నా
రాంచరణ్ తాజా చిత్రం "రచ్చ". చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 వ తేదీన ప్రారంభం కానుంది. రాంచరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ చిత్రం లో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయట. రచ్చ సినిమా కోసం రాంచరణ్ 8 ప్యాక్ బాడీ ని సిద్దం చేసుకున్నాడట. ఈ సినిమా లో 8 ప్యాక్ బాడీ తో అభిమానులను అలరించనున్నాడు మెగా పవర్ స్టార్. ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉందట. తమన్నా ఈ సినిమా లో 2 పీస్ బికినీ లో కనిపించబోతుందట. కుర్రకారు ఈ సీన్ లో తమన్నా ని చూసి మతి పోగొట్టుకునే విధం గా తీయబోతున్నారట. ఇలాంటి మరిన్ని జిమ్మిక్కులతో సినిమా తీయడానికి దర్శకుడు సంపత్ నంది సిద్దంగా ఉన్నాడని సమాచారం.

Saturday, May 14

రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా

రాంచరణ్ అల్లు అర్జున్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ వీళ్ళిద్దరి కోసం సరిబోయే  ఒక కథ ని కూడా తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని, పి ఆర్ పి శాసన సభ్యులు గంటా శ్రీనివాస రావు నిర్మిస్తాడని తెలుస్తోంది. ఇద్దరూ అగ్ర హీరోలు కావడం తో స్టొరీ ని ఏ మాత్రం పొరపాట్లు లేకుండా తయారు చేయాలని అందరూ ఆలోచిస్తున్నారట. ఈ మెగా ఫ్యామిలీ సినిమా ఎటువంటి సంచనాలు సృష్టిస్తోందో చూడాలి....

Monday, April 25

రాంచరణ్ "రచ్చ" లో చిరంజీవి ?

రాంచరణ్ చిరంజీవి
రాంచరణ్ తేజ్ తాజాగా కమిట్ అయిన చిత్రం రచ్చ. సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ఇది వరకే మొదలు కావలసి ఉంది. కానీ టాలీవుడ్ స్ట్రైక్ వలన సినిమా ఓపెనింగ్ ఆలస్యమైంది. మే మొదటి వారం లో రచ్చ సినిమా ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా లో చిరంజీవి నటించట్లేదు. కానీ సినిమా లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడట. కథ, సంగీతం, మేకింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా తన ప్రమేయం ఉండాలనుకుంటున్నాడట. చిరంజీవి చరిత్రలో సూపర్ హిట్ చిత్రాలు ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ మొదలైన చిత్రాల్లో మెగస్టార్ ప్రమేయం పూర్తిగా ఉంది. అవి ఎంతటి విజయాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగధీర తర్వాత కొద్దిగా మెత్తపడ్డ రాంచరణ్ తేజ్ కి మరో బ్లాక్ బస్టర్ ఇవాలనుకుంటున్నాడట చిరంజీవి. అందుకనే తాజా చిత్రం రచ్చ లో తన వంతు బాధ్యత వహించాలనుకుంటున్నాడని సమాచారం.  

Tuesday, March 22

బాబాయ్ "తీన్ మార్" మిస్ అవుతున్నాను - రాంచరణ్

రాంచరణ్ తేజ్
రాంచరణ్ ప్రస్తుతం మియామీలో ఉన్నాడు. తను ఇక్కడ ఉన్నా మనసు మాత్రం పూర్తిగా బాబాయ్ పవణ్ కల్యాణ్ నటించిన "తీన్ మార్" పైనే ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఒకవేళ మియామీ వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా తీన్ మార్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఉండేవాన్నని పేర్కొన్నాడు. తీన్ మార్ సినిమా పాటలు విన్నానని చాలా బాగున్నాయని చరణ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.   

Saturday, March 19

ఫిట్ నెస్ ట్రైనర్ తో రాంచరణ్ తిప్పలు

రాంచరణ్ తేజ్
ఆరంజ్ సినిమా తర్వాత ప్రారంభమైన రాంచరణ్ కొత్త సినిమా "మెరుపు" షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రాంచరన్ సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమాకి ఒప్పుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా విశేషమేమిటంటే రాంచరన్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో మియామీ లోని డేవిడ్ బార్టన్స్ జిం సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తన ట్రైనర్ చాలా కఠినమైన శిక్షణ ఇస్తున్నాడని చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇసుకలో 5 కిలోమీటర్లు పరుగెత్తించాడట. ఈ ఫిట్ నెస్ తర్వాత రాంచరన్ ఎంత తాజా గా కనిపిస్తాడో చూడాలి.   
Related Posts Plugin for WordPress, Blogger...