Showing posts with label Rajinikanth. Show all posts
Showing posts with label Rajinikanth. Show all posts

Saturday, May 21

అభిమానుల కోసం రజనీకాంత్ లేటెస్ట్ & రీసెంట్ ఫోటో

రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్ లో చేరిన నుంచి అభిమానులు, ప్రజలు ఎంతో ఆందోళన కి లోనవుతున్నారు. రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నా అభిమానుల్లో మాత్రం ఇంకా ఏదో చెప్పలేని అసంతృప్తి. ఎందుకంటే స్వయంగా రజనీకాంత్ ఫోటో గానీ వీడియో గానీ హాస్పిటల్ లో చేరిన తరువాత లభించకపోవడం. అయితే రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ ఉత్కంఠ కి తెర దించుతూ తన ట్విట్టర్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. రజనీకాంత్ తన కూతురితో ఎంతో ఉల్లాసంగా దిగిన తాజా ఫోటో అది. దీన్ని బట్టి రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని చెప్పవచ్చు.


Tuesday, April 26

చిరంజీవి పిలిస్తే రజనీకాంత్ రాలేదా ?

చిరు రజనీకాంత్
చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన మగధీర చిత్రం తమిళం లో "మావీరన్" గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే మావీరన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఘనం గా జరిగింది. అయితే ఈ ఫంక్షన్ కి చిరంజీవి రజినీకాంత్ ని ఆహ్వానించాడట. అయితే రజినీ రాలేదట. ఆ తర్వాత కమల్ హాసన్ ని ఆహ్వానించారట. రజినీకాంత్ రాకపోవడంతో చిరు చాలా ఫీల్ అయ్యాడట.

Tuesday, April 5

రజినీ పై అభిమానం ఎంతో చాటుకున్న పోనీ వర్మ

పోనీ వర్మ
ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ ఇటీవల ఒక విషయాన్ని గట్టిగా చెబుతోంది. ఫేమస్ సెలబ్రిటీల మీద జోకులు వేయడం సాధారణం. కానీ రజినీకాంత్ మీద మాత్రం జోకులు వేస్తే ఒప్పుకునేది లేదని అంటోంది. పోనీ వర్మ కి రజినీకాంత్ అంటే అంత అభిమానం. అంతేకాదు ఇటీవల భారత్, శ్రీలంక ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కి రజినీకాంత్ వెళ్ళి గెలిపించారని అంటొంది పోనీ వర్మ.
Related Posts Plugin for WordPress, Blogger...